రాష్ట్రంలో దుర్మార్గంగా ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దుర్మార్గంగా ఎన్నికలు

Oct 24 2026 12:34 AM | Updated on Oct 24 2026 12:34 AM

ఫ ఇది కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ

ఫ ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అత్యంత దుర్మార్గంగా ఉందని, ఇది కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చలాందని జైభీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అన్నారు. స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. కాకినాడ రూరల్‌, పిఠాపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ చూస్తే బాధ కలుగుతుందని అన్నారు. కనీసం నామినేషన్లు వేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పించలేదని, ఇతర అభ్యర్థులపై ఆయుధాలతో దాడులకు దిగడం సిగ్గు చేటన్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ జిల్లా తుని, తొండంగి మండలాల్లో కూటమి అభ్యర్థులు కాకుండా మిగతా ఎవరైనా నామినేషన్లు వేయడానికి ప్రయత్నిస్తే, వారిపై అధికారులు, పోలీస్‌ వ్యవస్థ ముందే దాడులకు దిగడం దారుణమన్నారు. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. 50 నుంచి 60 శాతం నామినేషన్లు వేయకుండా అడ్డుపడిందన్నారు. కూటమిలో 30 శాతం టికెట్లు అడిగే ప్రయత్నంలో జనసేన ఉందని, కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ దృష్టి పెట్టడం లేదన్నారు. షాడో సీఎంగా ఉన్న లోకేష్‌ ఇప్పటివరకు రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై నోరు విప్పలేదని, చంద్రబాబు మద్దతుతోనే ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారన్నారు. కత్తులు, గొడ్డళ్లతో బెదిరిస్తే నామినేషన్లు ఎలా వేస్తారని, దీనిపై సీట్ల కోసం పాకులాడుతున్న పవన్‌ కళ్యాణ్‌ దృష్టి పెట్టాలన్నారు. తమ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయదని, కానీ కూటమి అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement