అమలాపురం రూరల్: అమలాపురం ఈదరపల్లిలో జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలోని పోలీస్ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఓ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. దానిని నడుపుతున్న వ్యక్తి బైక్‌ను కింద పడేసి పరుగులు తీశాడు. ఓ పార్టీ ఊరేగింపుగా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. బైక్ వేగంగా ఎక్కువ దూరం నడపడంతో ఇంజిన్ వేడెక్కి మంటలు వచ్చి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


