సినిమా చూసి వచ్చేసరికి ఇంట్లో చోరీ! | - | Sakshi
Sakshi News home page

సినిమా చూసి వచ్చేసరికి ఇంట్లో చోరీ!

Oct 24 2026 12:34 AM | Updated on Oct 24 2026 12:34 AM

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన వైనమింది. ఈ ఘటన గొల్లప్రోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న ఊటుకూరి సుబ్రహ్మణ్యం తన కుటుంబ సభ్యులతో కలసి 22వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సినిమా చూసేందుకు పిఠాపురం వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి 12.20 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువాలోని 204 గ్రాముల బంగారు ఆభరణాలు, 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు కొంత నగదు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఎన్‌.దుర్గారావు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement