ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
కాకినాడ రూరల్: రమణయ్యపేట ఇందిరా కాలనీలో సోమవారం ఉదయం సిరిమల్లి పవన్ కుమార్ (21) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తి చేసిన పవన్ కుమార్ ఇంటి వద్దే ఉంటున్నాడు. తండ్రి ట్రావెల్స్‌లోను, తల్లి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉదయం విధులకు వెళ్లిన తర్వాత పవన్ కుమార్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. తల్లి సిరిమల్లి దుర్గాభవాని ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పవన్‌కుమార్ కుటుంబం 2004లో కరీంనగర్ నుంచి కాకినాడకు వచ్చి స్థిరపడింది.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నీట్ పరీక్ష కోసం చనిపోయిన 93 మంది విద్యార్థులకు ఉద్యమాన్ని అంకితమిస్తున్నామని జై భీమ్‌రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అన్నారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత నిర్వహించిన పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆ నిరసనకు తమ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారన్నారు. యువతతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలుసుకోవాలన్నారు.
ఈ కారు ఎవరిదో!
కాట్రేనికోన: పల్లంకుర్రు శివాలయం సమీపంలోని చింతల చెరువు రోడ్డులో అనుమానాస్పద కారు కలకరం లేపుతోంది. ఏపీ 05 ఈడబ్ల్యూ 0123 నంబర్ గల కారును కొన్ని నెలలుగా రోడ్డు పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు పార్కు చేసి వదిలేశారు. ఆ కారు సుదీర్ఘ కాలం ఉండటంతో కుట్ర కోణం ఏమైనా ఉందానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి కారు నంబర్ ఆధారంగా సమాచారం సేకరించి అపరిచితులను గుర్తించాలన్నారు.


