తాళ్లరేవు: ఆటోను ఢీకొని ఎనిమిది మంది మహిళల మృతికి కారణమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్‌కు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కాకినాడ జిల్లా అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు ఇచ్చింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ శుక్ర వారం తెలిపిన వివరాల మేరకు.. 2023లో జాతీయ రహదారి 216పై కోరంగి పంచా యతీ సుబ్బారాయుని దిమ్మ వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది మహిళల్లో ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ అయిన ముంగమూరి మహేష్ (సీతానగరం మండలం వంగలపూడి), వేగిరాజు సుధీర్ (తెలంగాణ)లను అరెస్ట్ చేసి జైలుకు పంపా రు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ 84 మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరచగా, పి.మురళీకృష్ణారెడ్డి దర్యాప్తు నిర్వహించి సాక్షులను విచారించారు. న్యాయమూర్తి కె.మోతీలాల్ ఆ సాక్ష్యాలను పరిశీలించి, ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎంవీఎస్‌ఎస్ ప్రకాశరావు, డి.నాగబాబులు వాదన వినిపించారు.


