కాలువలో మహిళ మృతదేహం | - | Sakshi
Sakshi News home page

కాలువలో మహిళ మృతదేహం

Mar 4 2026 7:33 AM | Updated on Mar 4 2026 7:33 AM

అనపర్తి: అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. అనపర్తికి చెందిన పడాల వెంకట రామకృష్ణారెడ్డి తండ్రి ఏడాది క్రితం చనిపోయారు. అప్పటి నుంచీ తల్లి పుష్పవతి (75) శేషయ్య నగర్‌లోని సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె చాలా కాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్‌లో మందులు వాడుతున్నారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనబడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాగా.. ఈ నెల ఒకటిన రామకృష్ణారెడ్డి తన తల్లికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఆమె మృతదేహం ఉన్నట్టు సమాచారం అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement