ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

అమలాపురం రూరల్‌: ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని గవర్నమెంట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాణ్యం వేణు, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్‌బాబు, ఏపీ జేఏసీ జిల్లా శాఖ అధ్యక్షుడు మాధవరపు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మునేశ్వరరావు అన్నారు. ఆదివారం అమలాపురం ఈదరపల్లి ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సంసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పీబీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కాగా, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 60 ఏళ్లు మాత్రమే వర్తింపజేస్తూ అసమానంగా చూస్తున్నారని అన్నారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడిగా దొడ్డ కాశీవిశ్వేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కామన గణేష్‌గౌడ్‌, కోశాధికారిగా వీఏవీవీఎస్‌ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడిగా పరమట భీమారావు సింగ్‌, ప్రచార కార్యదర్శిగా పిల్లా వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా షేక్‌ వలీబాబా, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఏపీఎన్జీవో ఏపీజేఏసీ జిల్లా నాయకులు సూర్యారావు, శ్రీనివాసులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పనబాక హేమంత్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు మద్దాల సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement