విఘ్నాలు తొలగించు గణపయ్యా.. | - | Sakshi
Sakshi News home page

విఘ్నాలు తొలగించు గణపయ్యా..

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

విఘ్న

విఘ్నాలు తొలగించు గణపయ్యా..

అయినవిల్లి: విఘ్నాలు తీర్చే గణపయ్యా.. మము కాపాడవయ్యా అంటూ భక్తులు ఆ స్వామివారిని కొలిచారు. ఆదివారం అయినవిల్లిలోని విఘ్నేశ్వరుని ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారు జామున ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 31 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 31 మంది, పంచామృతాభిషేకాల్లో ఓ జంట పాల్గొన్నారు. స్వామికి ఏడుగురు దంపతులు ఉండాళ్ల పూజ, ఓ చిన్నారికి నామకరణ, ఎనిమిది మందికి అక్షరాభ్యాసాలు నిర్వహించారు. 12 మందికి తులాభారం, నలుగురు చిన్నారులకు అన్నప్రాసన, 39 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,681 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజే స్వామివారికి వివిధ విభాగాల ద్వారా రూ.2,61,758 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

పాథాలజిస్ట్‌కు పురస్కారం

సఖినేటిపల్లి: మోరికి చెందిన పాథాలజిస్ట్‌ కొల్లాబత్తుల అర్పిత గత నెల 27న లండన్‌లో ఫెలోషిప్‌ ఆఫ్‌ ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ (ఎఫ్‌ఆర్‌సీపీ) అవార్డును అందుకున్నారు. ఆ దేశంలోని ది రాయల్‌ కాలేజీ ఆఫ్‌ పాథాలజిస్ట్స్‌ సెక్షన్‌లో సదరు విభాగ అధిపతి డాక్టర్‌ బెర్నీ క్రోయల్‌ చేతుల మీదుగా అర్పిత ఈ పురస్కారం స్వీకరించారు. ఆ వివరాలను ఆదివారం అర్పిత తండ్రి కె.విజయానంద రాజ్‌కుమార్‌ విలేకరులకు చెప్పారు.రాజమహేంద్రవరం గైట్‌ వైద్య కళాశాలలో అర్పిత ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో హౌస్‌ సర్జన్‌ చేశారు. అనంతరం ఛండీగఢ్‌ మెడికల్‌ కాలేజీలో పాథాలజీ విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తదుపరి విశాఖపట్నం కేజీహెచ్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం బ్రిటిష్‌ రాయల్‌ కాలేజ్‌లో వివిధ విభాగాల్లో ఎఫ్‌ఆర్‌సీపీ అవార్డులు ఎంపిక నిమిత్తం వివిధ దేశాల నుంచి స్పెషలైజేషన్‌ పూర్తి చేసిన డాక్టర్లు వెళ్లారు. రాయల్‌ కాలేజీ యాజమాన్యం నిర్వహించిన ఎంపికల్లో అర్పిత ప్రతిభ చాటి అవార్డు స్వీకరించారు. అర్పితకు మోరి మహిమ కోకోనట్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ చైర్మన్‌ ఓగూరి టాండన్‌రాజు, పాస్టర్‌ కేఎంజీ విజయం, కె.మన్సే ప్రసాద్‌ అభినందనలు చెప్పారు.

విఘ్నాలు తొలగించు గణపయ్యా.. 1
1/1

విఘ్నాలు తొలగించు గణపయ్యా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement