ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసే రుణాల ద్వారా ఉపాధి పొంది జీవితంలో స్థిరపడాలని అర్హులైన యువత ఎదురుచూస్తోంది. చంద్రబాబు సర్కారు ఎప్పుడు ఇస్తుందా అని పడిగాపులు కాస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. పాత రుణాలు వసూలైతేనే కొత్త వారికి మంజూరు చ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసే రుణాల ద్వారా ఉపాధి పొంది జీవితంలో స్థిరపడాలని అర్హులైన యువత ఎదురుచూస్తోంది. చంద్రబాబు సర్కారు ఎప్పుడు ఇస్తుందా అని పడిగాపులు కాస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. పాత రుణాలు వసూలైతేనే కొత్త వారికి మంజూరు చ

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

ఎస్సీ

ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసే రుణాల ద్వారా ఉపాధి పొంది

సాక్షి, అమలాపురం: నిరుద్యోగ భృతి లేదు.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు.. మెగా డీఎస్సీ పేరుతో ఇస్తానన్న ఉద్యోగాలకు కోత పెట్టారు.. స్కిల్‌ డవలప్‌మెంట్‌ వంటి కార్యక్రమాలకు అక్కరకు రావు.. అంతిమంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత మెరుగైన జీవనం సాగించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు తాజాగా ఉదాహరణ షెడ్యూలు క్యాస్ట్‌ (ఎస్సీ) కార్పొరేషన్‌ రుణాలు. గత పాలనా కాలంలో ఇచ్చిన రుణాలు చెల్లిస్తేనే కొత్తగా రుణాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు.

రుణాలకు బ్రేకులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు రాయితీతో కూడిన రుణాలకు చంద్రబాబు ప్రభుత్వం బ్రేకులు వేస్తోంది. 2014 నుంచి 2019 వరకు తీసుకున్న రుణాలు చెల్లిస్తే వచ్చిన సొమ్ములతోనే కొత్త రుణాలు ఇస్తామన్నట్టుగా వ్యవహరిస్తోంది. గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వడం ద్వారా రుణాలు మొత్తం చెల్లించాలని ఎర వేశారు. గత పాలనా కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,158 మందికి రుణాలు మంజూరు చేశారు. లబ్ధిదారులు నేటికీ రుణ బకాయిలు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా అప్పటి టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు బినామీల పేరుతో కార్పొరేషన్‌ రుణాలను బినామీల పేరుతో కొల్లగొట్టారని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా రుణాలు పొందినవారు సకాలంలో వాయిదాలు చెల్లించడం లేదు. ఇదే సమయంలో కార్పొరేషన్‌ రుణాలను తిరిగి చెల్లించాలని లబ్ధిదారులపై ఒత్తిడి పెంచింది. వారికి ప్రత్యేకంగా వడ్డీ రాయితీని ప్రకటించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015–16 సంవత్సరం నుంచి 2018–19 వరకు నేషనల్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 915 మంది లబ్ధిదారులకు రూ.36.39 కోట్లు, నేషనల్‌ సఫాయి కర్మచారి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 243 మంది లబ్ధిదారులకు రూ.8.28 కోట్ల రుణాలను అందించారు. తాజాగా ఆయా పథకాలకు ఉమ్మడి జిల్లాలోని లబ్ధిదారులకు రూ.10.25 కోట్ల వడ్డీ రాయితీ వస్తోందని అధికారులు చెబుతున్నారు. వీరిలో కోనసీమ జిల్లాలో నేషనల్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లబ్ధిదారులు 234 మంది ఏప్రిల్‌ 30 నాటికి బకాయిలను చెల్లిస్తే రూ.2.59 కోట్ల వడ్డీ మాఫీ, నేషనల్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 45 మంది లబ్ధిదారులు గడువులోగా బకాయిలను చెల్లించి రూ.56.73 లక్షలు వడ్డీ మాఫీ పొందవచ్చునని చెబుతున్నారు.

కూటమి పాలనలో..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్‌లో రుణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఐఎస్‌బీ సెక్టార్‌ వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఐటీ సర్వీసు పేరుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా, నియోజకవర్గంలో పదుల సంఖ్యలో మాత్రమే యూనిట్లు మంజూరు చేశారు. దీని వల్ల లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందనే ఉద్దేశంతో ఖంగుతున్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వీటిని రద్దు చేయించారు. తర్వాత పెద్ద సంఖ్యలో యూనిట్లు వస్తాయని లబ్ధిదారులను నమ్మబలికారు. అనంతరం ఆ సంగతే మరచిపోయారు. ఒకవైపు కొత్తగా రుణాలు మంజూరు చేయకుండా, మరోవైపు పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త వాటిని మంజూరు చేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసి ఎస్సీ యువత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఫ ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు

సర్కార్‌ మెలిక

ఫ పాత బకాయిలు వసూలైతేనే

కొత్తవి ఇస్తామని స్పష్టం

ఫ చంద్రబాబు గత పాలనలో

రుణాల మంజూరు

ఫ ఎస్సీల పేరుతో పొందిన టీడీపీ నేతలు

బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు

పాత రుణాలకు సంబంధించి లబ్ధిదారులు బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటూ ప్రభుత్వం మెలిక పెడుతోంది. గత నెలలో అమలాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులు, ఔత్సాహితులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలోనే రుణ బకాయిలు చెల్లిస్తే కొత్తగా అర్హులైన వారికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతుండడం గమనార్హం. దీనితో కొత్తగా రుణాలు పొందాలనకున్న వారందరూ నిరాశకు గురయ్యారు.

ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసే రుణాల ద్వారా ఉపాధి పొంది1
1/1

ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసే రుణాల ద్వారా ఉపాధి పొంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement