కోనసీమ బాలిక.. కేరళ దంపతులకు దత్తత | - | Sakshi
Sakshi News home page

కోనసీమ బాలిక.. కేరళ దంపతులకు దత్తత

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

కోనసీమ బాలిక.. కేరళ దంపతులకు దత్తత

కోనసీమ బాలిక.. కేరళ దంపతులకు దత్తత

సాక్షి, అమలాపురం: కోనసీమ చిన్నారి కేరళకు దత్తత వెళుతోంది. జిల్లాలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో శిశుగృహం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా ఒక ఆడపిల్లను దత్తత ఇచ్చారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి కోనసీమ కలెక్టరేట్‌ వేదికై ంది. కోనసీమ శిశుగృహ కేంద్రంలో సంజన అనే 15 నెలల పాప ఆశ్రయం పొందుతోంది. ఈ చిన్నారిని పిల్లలు లేని పలువురు దంపతులు దత్తత చేసుకునేందుకు ముందుకు వచ్చారు. దేశ వ్యాప్తంగా సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పిల్లలు లేని దంపతుల జాబితాలో కేరళకు చెందిన ఒక జంటకు ప్రాధాన్యతను బట్టి అవకాశం కల్పించారు. కేరళకు చెందిన బాదుషా, సమీనా దంపతులు ఎంపిక కావడంతో వారికి దత్తత ఇచ్చినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. వారికి కలెక్టరేట్‌లో బుధవారం పాపను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా శిశుగృహం ద్వారా అసహాయ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడం జరుగుతోందన్నారు. పిల్లలు లేని దంపతులు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుని, చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. దత్తత తీసుకున్న పిల్లలను కన్నబిడ్డలుగా ప్రేమతో చూసుకుని, వారికి మంచి విద్య, భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఐసీడీఎస్‌ పీడీ కె.నాగమణి, జిల్లా చైల్డ్‌ ప్రొడక్షన్‌ అధికారి బి.ఉమా లక్ష్మి, ప్రొటెక్షన్‌ ఆఫీస్‌ నాన్‌ ఇన్సి్‌ూట్యషన్‌ కేర్‌ శిరీష, శిశు గృహ మేనేజర్‌ ఎం.వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement