ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

ఫీజు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

అమలాపురం టౌన్‌: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థులు ఉండే సంక్షేమ హాస్టళ్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు స్థానిక ఎస్సీ కళాశాల హాస్టల్‌ వద్ద చలో విజయవాడ ధర్నా పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే జీవో నంబర్‌ 77ను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పీడీఎస్‌యూ ప్రతినిధులు పి.స్వరూప్‌, వి.సంతోష్‌, ఎ.సతీష్‌కుమార్‌, పి.స్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌  బకాయిలు విడుదల చేయాలి 1
1/1

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement