‘అక్షర ఆంధ్ర’తో ప్రతి ఒక్కరికీ విద్య
అమలాపురం రూరల్: ప్రతి ఒక్కరికీ విద్య అందించాలనే లక్ష్యంతో అక్షర ఆంధ్ర కార్యక్రమం కొనసాగుతోందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా బుధవారం అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షర ఆంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వయోజన విద్య నేర్వడం సామాజిక ఆర్థిక అభివద్ధికి ముఖ్యమైన ముందడుగు అన్నారు.
ఫ ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో పేదలకు ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా స్వావలంబన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ పీయూష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,666 మంది దాతలు 32,284 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు.


