కల్తీ పాల బాధితులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
సాక్షి, రాజమహేంద్రవరం: కల్తీ పాలుతాగి ఆస్పత్రి పాలైన బాధితులను వైఎస్సార్ సీపీ నేతల బృందం పరామర్శించింది. చికిత్స పొందుతున్న కిమ్స్, రెయిన్‌బో తదితర ఆస్పత్రులకు వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారు.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బాధితుల కుటుంబాలను పలకరించారు. ఎలాంటి సమయంలోనైనా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా పోరాడతామన్నారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ నేతలు మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్ ఉన్నారు.


