కోనసీమలో వర్షం
సాక్షి, అమలాపురం: వేసవి ఎండలు చిర్రెత్తిస్తున్న సమయంలో కోనసీమలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో సామాన్యులు సేద తీరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మంగళవారం మధ్యాహ్న సమయంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం అమలాపురం, కొబ్బరి వాణిజ్య కేంద్రం అంబాజీపేట, అయినవిల్లిలో మధ్యాహ్న సమయంలో రెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు భారీ వర్షం కురవడంతో రోడ్ల మీదకు నీరు చేరింది. వర్షం పడిన ప్రాంతంలో రబీ వరి చేలు, కొబ్బరి వంటి ఉద్యాన పంటలకు మేలు జరిగింది. అయితే వివాహాలు చేసుకునేవారు వర్షంతో ఇబ్బంది పడ్డారు.
కోనసీమలో వర్షం


