జగనన్న పాల వెల్లువ భవనంపై ‘జగనన్న’ పేరుకు టీడీపీ నేతలు పూసిన రంగు | - | Sakshi
Sakshi News home page

జగనన్న పాల వెల్లువ భవనంపై ‘జగనన్న’ పేరుకు టీడీపీ నేతలు పూసిన రంగు

Feb 25 2026 9:41 AM | Updated on Feb 25 2026 9:41 AM

జగనన్

జగనన్న పాల వెల్లువ భవనంపై ‘జగనన్న’ పేరుకు టీడీపీ నేతలు

సాక్షి, అమలాపురం: ‘‘అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కుక్కపిల్ల.. కాదేదీ కవితకనర్హం’’ అని మహాకవి శ్రీశ్రీ అంటే... ‘‘జట్టుకు రాసుకునే కొబ్బరి నూనె నుంచి మోటారు వాహనంలో వాడే పెట్రోల్‌ వరకు.. తినే ఆహారం నుంచి తాగే పాల వరకు’’ కాదేదీ కల్తీకి కనర్హం అన్నట్టుగా మార్చేస్తున్నారు. ఆబాల గోపాలానికి రోజు మొదలయ్యేది ‘పాల’తోనే. అలాంటి పాలు కూడా కల్తీ బారిన పడుతున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ఆరుగురు మృత్యువాత పడగా, 21 మంది చికిత్స పొందుతున్నారు. పాడి– పంటలకు ఆలవాలమైన ఉమ్మడి గోదావరి జిల్లాలో పాల కల్తీ జరిగి మరణ మృదంగం మోగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

డెయిరీలపై కొరవడిన అజమాయిషీ

గడచిన దశాబ్ద కాలంగా కోనసీమ జిల్లాలో పాల వినియోగం పెరగగా, పాడి పశువుల సంఖ్య తగ్గుతోంది. 2022 గణంకాల ప్రకారం జిల్లాలో (మండపేట నియోజకవర్గంతో కలిపి) 72,003 తెల్లజాతి పశువులు, 1,47,182 నల్లజాతి పశువులు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో తెలుపు, నల్లజాతి కలిపి సుమారు 1.60 లక్షల వరకు పాలు ఇచ్చే జంతువులు ఉన్నాయని అంచనా. పశువుల సంఖ్య తగ్గడం, వినియోగం పెరగడం వల్ల గుర్తింపు పొందిన ప్రైవేట్‌ డెయిరీల ఉత్పత్తులతోపాటు పల్లెలు, పట్టణాలలో అనుమతి లేని డెయిరీలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటిపై అటు పశు సంవర్థక శాఖ, ఇటు ఆహార కల్తీ నియంత్రణ అధికారుల అజమాయిషీ లేకపోవడం గమనార్హం.

వ్యాపారులపై సడలుతున్న నమ్మకం

పశు సంవర్ధక శాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది పాడి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి, పశువుల వైద్యానికి మాత్రమే పరిమితమవుతున్నారు. గతంలో జిల్లా స్థాయిలో ఒక కమిటీ పాల సేకరణ కేంద్రాల వద్ద మీటర్‌ రీడింగ్‌, ఫ్యాట్‌ కోసం ఏదైనా కల్తీ చేస్తున్నారా? అనేంత వరకై నా పరిశీలన చేసేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇక ఆహార కల్తీ నియంత్రణకు జిల్లా స్థాయిలో ఒక అధికారి, ఒకరిద్దరు సిబ్బందితో సరి. దీంతో డెయిరీలపైనా, రైతుల వద్ద నుంచి పాలు కొనుగోలు చేసి స్థానికంగా రోడ్ల వెంబడి అమ్మకాలు చేసేవారిపైనా నియంత్రణ లేకుండా పోయింది. ‘ఒకటి మాత్రం నిజం. రైతుల వద్ద పాలు ఎటువంటి కల్తీ జరగదు. ఎందుకుంటే వారు స్థానికంగా ఉంటారు. తెలిసి ఉన్న వినియోగదారులకే ఇస్తారు. కాని రైతుల వద్ద కొనుగోలు చేసి అమ్మకాలు చేసే వ్యాపారులను నమ్మలేకపోతున్నాం’ అని వినియోగదారులు తేల్చిచెబుతున్నారు.

స్వచ్ఛమైన పాలు అందించేందుకే

‘జగనన్న పాల వెల్లువ’

● వినియోగదారులకు స్వచ్ఛమైన పాలను అందించేందుకు.. పాడి పరిశ్రమను లాభాల బాట పట్టించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ‘జగనన్న పాల వెల్లువ’ను తీసుకువచ్చారు. రైతులు ఏర్పాటు చేసుకున్న అమూల్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.

● గ్రామీణ ప్రాంతంలో పాల సేకరణ వ్యవస్థ పటిష్టం చేసేందుకు బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ), ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌ (ఏఎంసీయూ)ల నిర్మాణానికి జిల్లాలో శ్రీకారం చుట్టింది.

● జిల్లాలో 149 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 157 ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌లు నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో 35 బీఎంసీయూల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టారు. ఏఎంసీలకు 21 చోట్ల స్థలాలను గుర్తించి పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. బీఎంసీలకు 111 చోట్ల, ఏఎంసీలకు 127 చోట్ల స్థలాలను గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారు.

● తొలి దశలో 38 చోట్ల బీఎంసీయూలు, 28 చోట్ల ఏఎంసీలయూల నిర్మాణం చేయాలని నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కొక్క బీఎంసీయూ సామర్థ్యం 2 వేల మెట్రిక్‌ టన్నులు కాగా, దీనిని రెండు, మూడు గ్రామాలకు ఒకటి చొప్పున నిర్మించారు. ఇక ఏఎంసీల సామర్థ్యం 160 లీటర్లు కాగా, వీటిని ఆర్‌బీకే పరిధిలో ఒకటి చొప్పున నిర్మించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది.

● మొత్తం ఈ వ్యవస్థలో గ్రామ స్థాయిలో మహిళలకు కీలక స్థానం కల్పించారు. గ్రామాల్లో మహిళలతో పాల సహకార సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా పాలను సేకరించాలని తలపోశారు. ఇలా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు పాల అమ్మకాలకు భరోసా దక్కితే రైతులు సైతం పాడిపై దృష్టి సారిస్తారు. దీనివల్ల పశువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నాటి ప్రభుత్వ ఉద్దేశం.

రాజమహేంద్రవరంలో కల్తీ పాల

ఘటనతో ఉలిక్కిపడ్డ కోనసీమ

జిల్లాలో పుట్టగొడుగుల్లా డెయిరీలు

వీటిపై కనీస సమాచారం లేని

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు

నాణ్యమైన పాలను అందించేందుకు

గతంలో జగనన్న పాల వెల్లువ

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత శిథిలావస్థలో భవనాలు

జగనన్న పాల వెల్లువ భవనంపై ‘జగనన్న’ పేరుకు టీడీపీ నేతలు 1
1/2

జగనన్న పాల వెల్లువ భవనంపై ‘జగనన్న’ పేరుకు టీడీపీ నేతలు

జగనన్న పాల వెల్లువ భవనంపై ‘జగనన్న’ పేరుకు టీడీపీ నేతలు 2
2/2

జగనన్న పాల వెల్లువ భవనంపై ‘జగనన్న’ పేరుకు టీడీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement