పోలీస్‌ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు

Feb 24 2026 7:28 AM | Updated on Feb 24 2026 7:28 AM

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు

అమలాపురం టౌన్‌: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 31 అర్జీలు వచ్చాయి. పోలీస్‌ గ్రీవెన్స్‌ను ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌ తమ చాంబర్ల నుంచి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఆ అర్జీలను పరిశీలించిన ఎస్పీ, ఏఎస్పీలు ఆయా పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో ఫోన్లలో మాట్లాడారు.

ఇంటర్‌ పరీక్షలకు 715 మంది విద్యార్థుల గైర్హాజరు

అమలాపురం టౌన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభయ్యాయి. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలైంది. ఈ పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటైంది. జిల్లా ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీఐఈవో) కె.చంద్రశేఖర్‌బాబు జిల్లాలోని ఇంటర్‌ పరీక్షలను పర్యవేక్షించారు. తొలి రోజు జిల్లాలో 715 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 13,592 మంది హాజరు కావాల్సి ఉండగా 12,877 మంది హాజరయ్యారని వివరించారు. జిల్లాలో మొత్తం హాజరు 94.73 శాతం నమోదైందన్నారు. మంగళవారం నుంచి ఇవే పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయని చెప్పారు.

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు

అమలాపురం రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. పింఛన్లు, భూ సమస్యలు, భూ సర్వే, సాగు, తాగునీరు ఇబ్బందులపై ప్రజలు వినతులు ఇచ్చారు. సమస్యలు విన్నవించుకుంటున్నా పరిష్కారం కావట్లేదని వారు వాపోయారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌ల్లో భూ సమస్యల ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతి, డీఆర్వో, మాధవి, డ్వామా పథక సంచాలకులు ఎస్‌. మధుసూదన్‌, సమగ్ర శిక్ష ఎడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ జి.మమ్మీ 200 అర్జీలను స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement