ఏకదంతుని దర్శనానికి తండోపతండాలు
అయినవిల్లి: భక్తుల కోర్కెలు తీర్చే అయినవిల్లి గణపయ్యను దర్శించేందుకు ఆదివారం భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. ఆర్చకులు స్వామి వారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది పాల్గొన్నారు. 16 మంది భక్తులు లక్ష్మీగణపతి హోమం చేయించుకున్నారు. భక్తదంపతులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామికి నలుగురు భక్త దంపతులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఓ చిన్నారికి నామకరణ, ఎనిమిది మందికి అక్షరాభ్యాసాలు చేశారు. ఇద్దరు చిన్నారులకు తులాభారం, 52 మందికి అన్నప్రాశన, 58 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 5218 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
తోటలమ్మకు రూ.30 లక్షలతో మకర తోరణాలు
అమలాపురం రూరల్: మండలంలోని పాలగుమ్మి గ్రామదేవత తోటలమ్మ అమ్మ వారికి రూ.30 లక్షల విలువైన 6 కిలోల వెండి తొడుగు, మకరతోరణం, 111 కిలోల పంచలోహ మకరతోరణాలను దాత సమర్పించారు. గ్రామానికి చెందిన బొక్కా వెంకటరత్నం (తాత), సత్యనారాయణ (తండ్రి)పేరున కుమారుడు బొక్కా రవి కుమార్ అమ్మవారికి మకరతోరణాలు చేయించారు. తోటలమ్మ అమ్మవారికి ఎంత చేయించినా తక్కువే అని భావోద్వేగానికి గురై ఆ ఆభరణాలు సమర్పించారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు దాత రవికుమార్‌ను అభినందించారు.
ఏకదంతుని దర్శనానికి తండోపతండాలు


