మూలన పడేశారు
చంద్రబాబు ప్రభుత్వం రాగానే జగనన్న పాల వెల్లువకు దాదాపు మంగళం పాడేశారు. పాడి రైతుకు మేలు చేసే వ్యవస్థను ధ్వంసం చేసి తమ సొంత డెయిరీలకు మేలు చేసుకునే పనిలో పడ్డారు. బీఎంసీయూలు, ఏఎంసీయూలను గాలికి వదిలేశారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు నిర్మాణం పూర్తయ్యి వినియోగంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రాయవరం, కొత్తపేట మండలం వాడపాలెం బీఎంసీయూలు పాడుబడిన భవనాలుగా మారిపోయాయి. వాడపాలెం బీఎంసీయూ చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. రూ.లక్షల విలువ చేసే జనరేటర్ నెలలు పాటు వినియోగంలో లేక పనిచేయకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఫర్నీచర్ దెబ్బతింటోంది. పైగా ఇది ఉన్నది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వగ్రామంలో అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం వచ్చిన తరువాత మార్పు ఏదైనా ఉందీ అంటే భవనానికి పెట్టిన జగనన్న పాల వెల్లువ అనే పేరులో జగనన్న పేరు కనపడకుండా రంగు పూయడమే. ఈ విధంగా తమ కక్ష సాధింపు ధోరణిని ‘పాల‘కులు బయట పెట్టుకున్నారని పాడి రైతులు విమర్శిస్తున్నారు.


