కమనీయం భీమనాథుని కల్యాణం
● నేటి రాత్రి 11.05 గంటలకు వేడుక
● ఒకే వేదికపై ముగ్గురు దేవుళ్లకు కల్యాణం
● ఫిబ్రవరి 3 వరకు ఉత్సవాలు
రామచంద్రపురం రూరల్: మానవుల కల్యాణం మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా అని వారి జీవన సాఫల్యం కోసం చేస్తుంటారు. దేవుని కల్యాణం మాంగల్యం తంతునానేన లోక రక్షణ హేతునా అని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం వార్షికంగా నిర్వహిస్తారు. పంచారామాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12 వ శక్తి పీఠంగా భాసిల్లుతున్న భూకై లాసం ద్రాక్షారామంలో విశ్వావసు నామ సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి అయిన బుధవారం ఒకే వేదికపై ఎక్కడా లేని విధంగా ముగ్గురు దేవతా మూర్తులు శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారు, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వరస్వామివారు, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణస్వామివార్ల కల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి.
నేటి నుంచి కల్యాణ మహోత్సవాలు : ముగ్గురు దేవుళ్లకు ఒకే రోజు దివ్య కల్యాణం
నేటి నుంచి ఫిబ్రవరి 3 శుక్రవారం వరకు పాంచాహ్నిక దీక్షగా మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వా మి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణస్వామి, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వరస్వామి వార్లకు ధ్వజారో హణ, దివ్య కల్యాణ మహోత్సవాలు, రాత్రి రోహిణీ నక్షత్రయుక్త సింహలగ్నమందు రాత్రి 10.17 గంటలకు ముగ్గురు దేవుళ్ల దివ్య కల్యాణ మహోత్సవాలు దేవస్థానం బ్రహ్మ దేవులపల్లి ఫణిరామకృష్ణ, అర్చకస్వాములు నిర్వహించనున్నారు.
కార్యక్రమ వివరాలు : 28న లక్ష రుద్రాక్ష పూజ, నంది వాహనంపై స్వామివార్ల గ్రామోత్సవం, రాత్రి 10.17 గంటలకు స్వామివార్ల దివ్య కల్యాణ మహోత్సవాలు, 29న గరుడవాహనంపై స్వామివార్ల నగరోత్సవం. 30న నగరోత్సవం, సాయంత్రం శ్రీ స్వామివార్ల సదస్యం. తదుపరి పండిత సత్కారం, రాత్రి సర్వ వాహ నాలపై శ్రీ స్వామివార్ల నగరోత్సవం. 31న ఉదయం నగరోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం, సాయంత్రం వేగాయమ్మపేటలో ఆస్థాన పూజ. ఫిబ్రవరి 1న ఉదయం వసంతోత్సవం, నాకబలి, గ్రామోత్సవం అనంతరం త్రిశూల స్నానం, చక్ర స్నానం, రాత్రి సర్ప వాహనాలపై స్వామివార్ల నగరోత్సవం, చోరోత్సవం, కవాట బంధనం. 2న జల విహారం. 3న పుష్పోత్సవం


