మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

Jan 27 2026 8:25 AM | Updated on Jan 27 2026 8:25 AM

మంగళవ

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

జాతీయ జెండాకు

వందనం చేస్తున్న

కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, ఎస్పీ రాహుల్‌ మీనా, జేసీ నిషాంతి

ప్రగతి పథంలో ముందుకు..

అమలాపురం రూరల్‌: అభివృద్ధి పథంలో కోనసీమ జిల్లా ముందుకు సాగుతోందని కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌ అన్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. సుమారు ఐదు గంటల పాటు ఈ వేడుకలు సాగాయి. జాతీయ పతాకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించి ఎన్‌సీసీ విద్యార్థులు, రిజర్వ్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధిని కలెక్టర్‌ వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జిల్లా యంత్రాంగం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. భారత రత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను జీవితాల్లో ఆచరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఎస్పీ రాహుల్‌ మీనా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, డీఆర్‌ఓ కె.మాధవి, ఆర్డీవోలు పి.శ్రీకర్‌, దేవరకొండ అఖిల, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతి కలెక్టరేట్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.

అలరించిన విన్యాసాలు

పోలీసులు, ఎస్‌సీసీ క్యాడెట్లు సంప్రదాయ వాయిద్యాలకు లయబద్ధంగా చేసిన కవాతు ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. స్కౌట్‌ బృందం చేసిన విన్యాసాలు అలరించాయి. పోలీస్‌ కుక్కలు స్పైడర్‌ హనీ, శాండీలు విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. మంటలతో ఉన్న రింగ్‌లో డాగ్‌ జంప్‌ చేసుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. డాగ్‌ కలెక్టర్‌కు సెల్యూట్‌ చేసి అందిరినీ ఆశ్చర్య పరచింది. అగ్నిమాపక శకటంతో జాతీయ పతాకంలోని మూడు రంగులతో చేసిన విన్యాసాలు అలరించాయి.

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

జిల్లాలోని ఏడు పాఠశాలలకు చెందిన విద్యార్థుల గేయ, నృత్య రూపక, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హిందీ, తెలుగు జాతీయ గీతాలకు అనుగుణంగా నృత్యం ప్రదర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలలో ఏడు పాఠశాలలు పాల్గొనగా అమలాపురం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రఽథమ, కామనగరువు ఆదిత్య స్కూలుకు ద్వితీయ, పి.గన్నవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు తృతీయ బహుమతులు దక్కాయి. మిగిలిన 4 పాఠశాలలకు ప్రత్యేక అవార్డులను అందించారు.

ఆకర్షించిన శకటాల ప్రదర్శన

గణతంత్ర వేడుకల సందర్భంగా 10 ప్రభుత్వ శాఖలకు సంబంధించి శకటాల ప్రదర్శన జరిగింది. ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు అద్దం పడుతూ శకటాలను రూపొందించారు. ఈ శకటాల ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ శకటాల ప్రదర్శనలో వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖల శకటం ప్రథమస్థానంలో నిలవగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటం ద్వితీయ బహుమతిని సాధించింది. అమలాపురం పురపాలక సంఘం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌కు తృతీయ బహుమతి లభించింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో కాశీ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అగ్నిమాపక విన్యాసాలు

కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

బాలయోగి స్టేడియంలో

గణతంత్ర వేడుకలు

ఆకట్టుకున్న పోలీస్‌ కవాతు..

శకటాల ప్రదర్శన

సాంస్కృతిక కార్యక్రమాలతో

అలరించిన విద్యార్థులు

పాల్గొన్న ఎస్పీ రాహుల్‌ మీనా,

జేసీ నిషాంతి

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20261
1/7

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20262
2/7

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20263
3/7

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20264
4/7

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20265
5/7

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20266
6/7

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20267
7/7

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement