స్కేటింగ్‌లో విద్యార్థి వివేక్ ప్రపంచ రికార్డు
అమలాపురం టౌన్: స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న కాండ్రేగుల ఆనంద్ వివేక్ స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. రాజమహేంద్రవరం స్కేటింగ్ రింగ్‌లో గణతంత్ర దినోత్సవం వేళ ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యూఎస్‌ఏ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో వివేక్ 1 గంట 26 నిమిషాల 26 సెకన్లు స్కేటింగ్ చేసి రికార్డు సాధించాడు. దీంతో వివేక్ పేరు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యూఎస్‌ఏలో నమోదైంది. వివేక్ ఆ సంస్థ నుంచి పతకాన్ని అందుకున్నాడు. పాఠశాలలో మంగళవారం జరిగిన అభినందన సభలో హెచ్‌ఎం భమిడిపాటి వెంకట సాయి రామకృష్ణ, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు కామన గణపతిరావు, తోట రవి, పరమట విష్ణుప్రసాద్‌తో పాటు పాఠశాల విద్యా కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.


