గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్
అమలాపురం రూరల్: గోదావరి పుష్కరాలు – 2027కు ఇప్పటి నుంచే ఘాట్ల పునరుద్ధరణ, భద్రత, రవాణా, నీటి, ఆరోగ్య సేవలతో సన్నద్ధం కావాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతి నుంచి కలెక్టర్లతో ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్షరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో 212 కిలోమీటర్లు గోదావరి తీరం ఉన్నదని భక్తుల సౌకర్యార్థం కొన్ని ఘాట్లను ఎంపిక చేసి నాలుగు మాసాల నుంచి సివిల్ పనులు చేపట్టామని తెలిపారు. ఘాట్ల అభివృద్ధి, అప్రోచ్ రోడ్లు భక్తుల సౌకర్యార్థం సివిల్ వర్క్ నిర్వహణ, భక్తుల రద్దీ, వసతి, శానిటేషన్ సమస్యలు లేకుండా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పనులు నిర్వహించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా సుందర ప్రదేశాలు, ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. కోనసీమ ప్రాంతంలో మండువా లోగిళ్లలో హోం స్టే కోసం పర్యాటకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఆ దిశగా మరిన్ని మండువా లోగిళ్లును ఎంపిక చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి పాల్గొన్నారు.
బాడ్మింటన్ టోర్నీ
అంపైర్‌గా శ్రీనివాస్
అమలాపురం రూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఆదివారం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా మాస్టర్స్ ర్యాంకింగ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఈదరపల్లి అలా వైకుంఠపురానికి చెందిన అడపా శ్రీనివాస్‌ను న్యాయనిర్ణేతగా ఎంపిక చేస్తూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి ఉత్తర్వులు అందాయని తెలిపారు. శ్రీనివాస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ అంపైర్. గతంలో పలు జాతీయ టోర్నమెంట్లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
రీ సర్వేతో నాణ్యమైన సేవలు
అమలాపురంరూరల్: భూ పరిపాలన రెవెన్యూ అంశాలలో రీ సర్వే ప్రక్రియ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని జాయింట్ కలెక్టర్ టీ.నిశాంతి రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె భూ పరిపాలన రీ సర్వే ప్రక్రియ అమలు, పురోగతి, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై రెవెన్యూ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించడం, పారదర్శకత పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. డీఆర్‌ఓ కె. మాధవి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు పెద్ద పీట వేయాలన్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకుడు కె. ప్రభాకర్ పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్
గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్


