కమిటీల నియామకాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కమిటీల నియామకాలు పూర్తి చేయాలి

Jan 24 2026 7:17 AM | Updated on Jan 24 2026 7:17 AM

కమిటీల నియామకాలు పూర్తి చేయాలి

కమిటీల నియామకాలు పూర్తి చేయాలి

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబి

అమలాపురం రూరల్‌: జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీల నియమకాలు పూర్తి చేయాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) పిలుపునిచ్చారు. అమలాపురం మండలం భట్నవెల్లిలో మాజీమంత్రి పినిపే విశ్వరూప్‌ నివాసంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం జిల్లా సమావేశం జరిగింది. బాబీ మాట్లాడుతూ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలన్నారు. రైతులకు ప్రధానమంత్రి బీమా యోజన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఉప్పులగుప్తం మండలం కూనవరం, అల్లవరం మండలం రామేశ్వరం సముద్ర మొగలు మూసుకుపోవడం వల్ల ఏర్పడుతున్న ముంపు సమస్యను పరిష్కరించాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ కోసం రైతు సంఘాలతో కలసి కలెక్టర్‌ను కోరుతామన్నారు. ఆధునీకరణ పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలన్నారు. వెబ్‌ లాండ్‌ పోర్టల్‌ లో లోపాలు, రెవెన్యూ తప్పిదాల వల్ల రైతుకు శాపాలుగా ఉన్నాయని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో కీలక మార్పులు చేయాలన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఇందుకూరి సత్యనారాయణరాజు, సంయుక్త కార్యదర్శి గుబ్బల రమేష్‌, ఢిల్లీ నారాయణ మాట్లాడుతూ శంకర గుప్తం డ్రైయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కరం చూపాలన్నారు. ఆధునీకరణ వల్ల రైతులకు గోగులమఠం, కరవాక, ముత్యాల పాలెం గ్రామాల్లో ఆక్రమణలు, ఆక్వా చెరువులు చిత్తడి నేలల్లో మేటలు వేయడం వల్ల ముంపు నీరు వెళ్లడం లేదన్నారు. ఆక్రమణలు తొలగించి డైయిన్‌ను ఆధునీకరిచాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు చిక్కం బాలయ్య, ఢిల్లీ నారాయణ, తులా గోపాలకృష్ణ, పిప్పర రాజు, కె. జవహర్‌, పళ్ల. వి. వి సత్యనారాయణ, శీలం సూరిబాబు యాళ్ళ చిన్న, నాగు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement