జంతు సంక్షేమానికి పాటు పడాలి | - | Sakshi
Sakshi News home page

జంతు సంక్షేమానికి పాటు పడాలి

Jan 24 2026 7:17 AM | Updated on Jan 24 2026 7:17 AM

జంతు సంక్షేమానికి పాటు పడాలి

జంతు సంక్షేమానికి పాటు పడాలి

అమలాపురం టౌన్‌: జంతు స్వేచ్ఛ, జంతు హక్కుల చట్టాలపై అవగాహన పెంచుకుని అందరూ జంతు సంక్షేమానికి పాటు పడాలని పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్‌ కర్నీడి మూర్తి పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుంచి 30 వరకూ జరుగుతున్న జంతు సంక్షేమ పక్షోత్సవాలు వసంత పంచమి పర్వదినాన అమలాపురంలోని శ్రీగౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలలో శుక్రవారం జరిగాయి. గోశాలలో జరిగిన జంతు సంక్షేమ పక్షోత్సవాలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్‌మూర్తితో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.విజయరెడ్డి ప్రారంభించారు. ముందుగా గోపూజ నిర్వహించారు. పశు సంరక్షణ – హక్కులకు సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు. గోశాలలో ఉన్న దాదాపు 150 గోవులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం రైతులతో అవగాహన సదస్సు జరిగింది. మాట్లాడుతూ జీవ జాతుల పట్ల అందరూ ప్రేమాభిమానాలు కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఓ బాధ్యతగా వ్యహరించాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ అధికారులను గోశాల ప్రతినిధులు సత్కరించారు. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణ, పశు వైద్యాధికారులు మేడిద నారాయణరావు, మాధురి, కావ్య, గో సేవకులు లింగోలు విస్సు, చాగంటి ప్రసాద్‌, కేవీ మావుళ్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement