జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు సుష్మ
కాజులూరు: జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన బుడితి సుష్మ ఎంపికై ంది. ఈ మేరకు బుధవారం పాఠశాలలో హెచ్‌ఎం ఎస్‌ఎస్‌బీ సుశీలమణి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ జి.సునీల్ కుమార్ మాట్లాడుతూ డిసెంబరు 11 నుంచి 13 వరకూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఎస్‌జీఎఫ్ అండర్ – 17 రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు జరిగాయన్నారు. వీటిలో తమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని బుడితి సుష్మ చక్కని ప్రతిభ కనపరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకూ పరిగే జాతీయ స్థాయి పోటీలలో సుష్మ రాష్ట్ర టీమ్ తరఫున పోటీపడుతుందన్నారు. ఆ జట్టుకు రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది క్రీడాకారులు ఎంపిక కాగా, వారిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తమ పాఠశాలకు చెందిన సుష్మ ఒక్కరే ఎంపిక కావడం గర్వకారణమన్నారు.


