కార్యకర్తలకే పెద్ద పీట
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీలో కార్యకర్తలకే పెద్ద పీట వేస్తామని పార్టీ సంస్థాగత నిర్మాణ జిల్లా ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల నియామకాలకు కసరత్తు జరుగుతోందని, కార్యకర్తల అండతో వైఎస్సార్ సీపీనీ మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం ద్వారా ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం పదివేల మంది కార్యకర్తలు ఓ సైన్యంలా చంద్రబాబు ప్రభుత్వ శుష్క వాగ్దానాలపై పోరాటాలు చేస్తారని చెప్పారు. నాగార్జున యాదవ్, రాజా మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల ప్రచారంపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉద్యమిస్తారని స్పష్టం చేశారు. జక్కంపూడి రాజా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలకు వర్క్ షాపును నిర్వహించారు. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టంగా నిర్మించుకునే విధానాలను వివరించారు. నియోజకవర్గాన్ని డివిజన్లుగా విభజించుకుని కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తన నియోజకవర్గమైన రాజానగరంలో ఇప్పటికే పూర్తయిన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ఆయన వివరించారు. రాజానగరం నియోజకవర్గాన్ని 14 డివిజన్లుగా విభజించి సంస్థాగత నిర్మాణం చేసినట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేసిన పోరాటాల ఫలితంగా నేడు ఆ కాలేజీల పనులకు చంద్రబాబు సర్కారు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇది మన పార్టీ సాధించిన విజయమని గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌ను 2029 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ, పార్టీ సీఈసీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి తమ ప్రసంగాల్లో పార్టీని పటిష్టం చేసే దిశగా సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోపు జిల్లాలోని అన్ని గ్రామ స్థాయి పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం పూర్తి కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి సూచించారు.
వైఎస్సార్‌కు నివాళులు
అమలాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ (బులినాని) పార్టీ పెద్దలను తొలుత వేదికపైకి ఆహ్వానించారు. వేదికపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ సీఈసీ సభ్యులు పీకే రావు, కేఎస్‌ఎన్ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, వంటెద్దు వెంకన్నాయుడు, చింతలపాటి శ్రీనివాసరాజు, కటకంశెట్టి ఆదిత్యకుమార్, కర్రి నాగిరెడ్డి, దూలం వెంకన్నబాబు, పాటి శివకుమార్, మున్సిపల్ చైర్‌పర్సర్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరి రామగోపాల్, కొనుకు గౌతమీ, గూడపాటి రమాదేవి, ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, మార్గన గంగాధరరావు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి భరత్ భూషణ్, సాకా మణికుమారి, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు గొవ్వాల రాజేష్, కాశి మునికుమారి, సాకా ప్రసన్నకుమార్, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరజాకుమారి, చీకట్ల కిషోర్, షేక్ అబ్దుల్ ఖాదర్, తోరం గౌతమ్ రాజా, మిండగుదటి శిరీష్, జిన్నూరి వెంకటేశ్వరరావు, అబాక్ హుస్సేన్, ఉంగరాల సంతోష్, ఉండ్రు వెంకటేష్, కాశి రమణ పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు
వర్క్‌షాపులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్న జక్కంపూడి రాజా
చంద్రబాబు అరాచకాలపై ఇకపై వైఎస్సార్ సీపీ సైన్యం పోరాటాలు
పార్టీ సంస్థాగత నిర్మాణ ఇన్‌చార్జి నాగార్జున యాదవ్,
యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా
కార్యకర్తలకే పెద్ద పీట
కార్యకర్తలకే పెద్ద పీట


