భూ పరిపాలనలో పురోగతి సాధించాలి
అమలాపురం రూరల్: ప్రభుత్వ ప్రాధాన్య అంశాలలో ఒకటైన భూ పరిపాలన నిర్దేశిత అంశాల్లో పురోగతిని సాధించి ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ క్లినిక్‌లు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మ్యుటేషన్‌లు, రీ సర్వే, వెబ్ లాండ్ కొత్త మాడ్యూల్స్ పై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలన్నారు. డీఆర్‌ఓ కె.మాధవి, ఆర్డీవోలు దేవరకొండ అఖిల, పి శ్రీకర్, సర్వే ఏడీ కే. ప్రభాకర్ పాల్గొన్నారు.


