ప్రయోగం ఫలించేలా!
భాగాల గుర్తింపుతోనే మార్కులు
జంతుశాస్త్ర ప్రయోగ పరీక్షలో నాలుగు ప్రశ్నలుంటాయి. ఒకటో ప్రశ్నలో భాగంగా పటం గీసి భా గాలను గుర్తించాలి. పటం అందంగా ఉండాలి. వీటికి ఆరు మార్కులు. రెండో ప్రశ్న గా ఇచ్చిన ఎక్స్‌పర్మెంట్‌కు మూల సూత్రం, పట్టిక, ప్రయోగ విధానం, ఫలితం రాయాలి. సూత్రానికి ఒకటి, ప్రయోగ విధానానికి మూడు, ఫలితానికి ఒకటి కలిపి మొత్తం ఐదు మార్కులు ఉంటాయి. మూడో ప్రశ్నలో ‘ఎ’ నుంచి ‘జి’ వరకు ఉప ప్రశ్నలు ఉంటా యి. అకసేరుకాలు, సక సేరుకాలకు సంబంధించిన స్లైడులు, స్పెసిమన్లను గుర్తించడంలో ఒత్తిడికి లోనుకాకూడదు. ఏడు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కు ల వంతున పద్నాలుగు మార్కులు. 4వ ప్రశ్న రికార్డు. దానికి ఐదు మార్కులు ఇస్తారు. ప్రాక్టికల్స్‌లో 30 మా ర్కులు తెచ్చుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదు. పరీక్షా సమయంలో ఒత్తిడి లేకుండా సున్నితంగా పరిశీలించాలి. పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. రికార్డు లో పటాలు, దాని సూచికలు బాగుండాలి. శరీర ధర్మశాస్త్ర ప్రయోగాల్లో తప్పనిసరిగా ఉద్దేశం, సూత్రం, ప్రయోగ విధానం, ఫలితం, మూలసూత్రం ఉండాలి.
– పాలిక జగదీశ్వరరావు, జంతుశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సామర్లకోట
ఫ ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ఫ అదే నెల 10వ తేదీ వరకూ నిర్వహణ
ఫ ప్రత్యేక శ్రద్ధ చూపితే మార్కులు సులువే
ఫ విద్యార్థులకు అధ్యాపకుల సూచనలు
రాయవరం: విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ అత్యంత కీలకమైంది. కోరుకున్న కళాశాలలో, కోర్సులో సీటు దక్కించుకోవాలంటే ఇక్కడ సాధించే మార్కులు ఎంతో ముఖ్యం. ప్రధానంగా సైన్స్ విద్యార్థుల మార్కుల్లో ప్రాక్టికల్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అధిక మార్కుల సాధించాలంటే ప్రయోగ పరీక్షలు కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్‌లో అధిక మార్కులు సాధించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అయితే ఏ చిన్న తప్పిదం చేసినా మార్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. విద్యార్థులు ఆసక్తి చూపితే 30కి 30 మార్కులు సాధించవచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ప్రాక్టికల్స్‌లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలో ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులు తెలియజేస్తున్నారు. వీటిని ఆచరిస్తే మంచి స్కోర్ చేయవచ్చు.
మంచి మార్కులు సాధించొచ్చు
భౌతిక శాస్త్రానికి సంబంధించి మూడు గంటల సమయానికి 30 మార్కులు కేటాయిస్తారు. మొత్తంగా 20 ప్రయోగాల్లో ఆరు విభాగాల నుంచి 38 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి బ్యాచ్‌కు 12 ప్రశ్నలు వంతున ఇస్తారు. ప్రయోగ సూత్రానికి రెండు మార్కులు, ప్రయోగ విధానానికి మూడు మార్కులు, పట్టికలు, పరిశీలనలు, గ్రాఫ్‌లకు ఎనిమిది మార్కులు, గణనకు నాలుగు, జాగ్రత్తలకు రెండు, ఫలితం, ప్రమాణాలకు రెండు మార్కులు, రికార్డులకు నాలుగు, వైవాకు ఐదు మొత్తంగా 30 మార్కులుంటాయి. గణన అనే శీర్షిక కింద రఫ్‌గా చేసినదంతా రాయాలి. దానికి నాలుగు మార్కులు వస్తాయి. అన్ని ప్రయోగాలకు జాగ్రత్తలు తప్పనిసరిగా రాయాలి. అన్ని ప్రయోగ విలువలు ఒకే ప్రమాణ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ప్రమాణాలు ప్రతి విలువకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పట్టికల్లో ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ప్రశ్నలకు ఒకే శీర్షికలు ఉంటాయి. విద్యుత్తు ప్రయోగాలకు సర్క్యూట్ డయాగ్రామ్ (వలయ చిత్రం) తప్పనిసరిగా వేయాలి.
– టేకుమూడి రామ్‌కుమార్, ఫిజిక్స్ అధ్యాపకుడు,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాజులూరు
సూటిగా సమాధానాలు చెప్పాలి
వృక్షశాస్త్రం ప్రయోగ పరీక్షకు సంబంధించి 30 మార్కుల ప్రశ్న పత్రంలో ఐదు విభాగాలు ఉంటాయి. ఒకటో ప్రశ్నకు వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం వస్తుంది. వర్ణణను క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా రాయాలి. అడిగిన చిత్రపటాలు, లక్షణాలు, బాగా సాధన చేసి తప్పులు లేకుండా రాయాలి. ఇచ్చిన మొక్కను బట్టి పుష్పచిత్రం, సమీకరణం, కుటుంబం గుర్తింపు తప్పనిసరి. రెండో ప్రశ్న వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి వస్తుంది. ఇచ్చిన మెటీరియల్ బట్టి స్లైడ్ తయారీని చాలా శ్రద్ధగా, శుభ్రంగా చేయాలి. కవర్ స్లిప్‌ను ఫిక్స్ నీట్‌గా వేసి, శాఫ్రనీను ఎక్కువ కాకుండా చూడాలి. భాగాలు గుర్తించిన విస్తరించిన భాగం పటం గీసి, గుర్తింపు రాయడం ముఖ్యం. మూడో ప్రశ్న వృక్ష శరీర ధర్మశాస్త్రం (లైవ్ ప్రయోగాలు) లాటరీ పద్ధతిలో విద్యార్థికి వచ్చిన ప్రయోగానికి అనుగుణంగా పరికరాల అమరిక చేయాలి. ఉద్దేశం, సూత్రం, పరిశీలన ఫలితం మాత్రమే రాయాలి. ఇవి చాలా సులభమైన ప్రశ్నలు. నాలుగో ప్రశ్నకు ఐదు మార్కులు పొందవచ్చు. స్పాటర్ లేదా స్లైడ్‌ను గుర్తించి దాని లక్షణాలు రాయాలి.
– కట్టా శ్రీనివాస్, బోటనీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముమ్మిడివరం
ఫలితం తప్పనిసరి
రసాయనశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల సమయం ఇస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇచ్చిన లవణం కరంగు భౌతిక స్థితి, జ్వాలా వర్ణ పరీక్ష, వేడి చేయడం తర్వాత ఆనయాన్, కాటయాన్‌లను గుర్తించడం, వాటి నిర్ధారణ పరీక్షలు ముఖ్యమైనవి. చివరగా ఫలితం తప్పనిసరిగా రాయాలి. ఈ విభాగానికి పది మార్కులుంటాయి. రెండవ విభాగంలో ఘన పరిమాణాత్మక విశ్లేషణకు 8 మార్కులు. అందులో మొదటి పది నిమిషాల్లో ప్రయోగ విధానం రాయాలి. బ్యూరెట్ రీడింగులు, ఎటువంటి కొట్టివేతలు లేకుండా పట్టికలు రాసి, లెక్కింపు విధానం, ఫలితం రాయాలి. మూడో విభాగంలో ఎ నుంచి డి వరకు ప్రశ్నల్లో ఒకటి మాత్రమే చేయాలి. ఈ విభాగానికి ఆరు మార్కులు. ‘ఎ’లో ఇచ్చిన కర్బన పదార్థం నుంచి ప్రమేయ సమూహాన్ని గుర్తించాలి. ‘బి’లో కొల్లాయిడల్ ద్రావణాలను తయారు చేయడం, ‘సి’లో క్రొమోటోగ్రఫీ, ‘డి’ లో కార్బోహైడ్రేట్స్ చర్యలు, ప్రొటీన్ల చర్యలు ఉంటాయి.
– పి.రాజు, కెమిస్ట్రీ లెక్చరర్,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయవరం
ప్రయోగ పరీక్షల షెడ్యూల్
ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు.. ప్రతి రోజూ ఉదయం 9 – 12, మధ్యాహ్నం 2 – 5 గంటల మధ్య జరగనున్నాయి. ప్రయోగ పరీక్షల్లో ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు కేటాయిస్తారు.
ప్రయోగం ఫలించేలా!
ప్రయోగం ఫలించేలా!
ప్రయోగం ఫలించేలా!
ప్రయోగం ఫలించేలా!


