నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
అమలాపురం టౌన్: సంస్థాగతం నిర్మాణంపై అమలాపురం వాసర్ల గార్డెన్స్‌లో మంగళవారం ఉదయం 9 గంటలకు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. జగ్గిరెడ్డి, పార్టీ అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశానికి జిల్లాలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, మండల కమిటీలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విధిగా హాజరు కావాలని కోరారు.
పీజీఆర్‌ఎస్‌కు 160 అర్జీలు
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యకమ్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 160 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, వచ్చిన ప్రతి ఆర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ, రెవెన్యూ ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి సోమవారం రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో సరైన విధంగా అర్జీల నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.మాధవి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఎల్‌డీఓలు రాజేశ్వరరావు వేణుగోపాల్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 25 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి న ప్రజల నుంచి ఎస్పీ రాహుల్ మీనా ఫిర్యా దులు స్వీకరించారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ కూడా ఫిర్యాదులను పరిశీలించారు.
కార్మిక కోడ్‌లను నిరసిస్తూ ధర్నా
అమలాపురం రూరల్: బ్రిటిష్ కాలం నాటి నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని 4 కార్మిక కోడ్‌లుగా మార్చడాన్ని నిరసిస్తూ సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి. దుర్గాప్రసాద్, ఎం.బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ, కార్మికుల కనీస వేతనం, భద్రత, సంఘం పెట్టుకునే హక్కును హరిస్తూ ఈ కోడ్‌లు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల కోత ద్వారా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఎసరు పెట్టాలని కేంద్రం చూస్తోందని ధ్వజమెత్తారు. సీఐటీయూ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సకల సూర్యనారాయణ, టీ. నాగ వరలక్ష్మి, బళ్ల పర్వతాలు, ఎన్ లక్ష్మణ్, సతీష్ పాల్గొన్నారు.
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం


