ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా చంద్రబాబూ? | - | Sakshi
Sakshi News home page

ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా చంద్రబాబూ?

Jan 18 2026 7:23 AM | Updated on Jan 18 2026 7:23 AM

ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా చంద్రబాబూ?

ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా చంద్రబాబూ?

అమలాపురం రూరల్‌: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత యువకుడు మందా సాల్మన్‌ను పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ అమలాపురం మండలం ఈదరపల్లి బొంతువారిపేటలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం వైఎస్సార్‌ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పీఏసీ సభ్యుడు, పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, కుడుపూడి సూర్యనారాయణరావు, సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ, పాముల రాజేశ్వరిదేవి, నియోజవర్గం కో ఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, పినిపే శ్రీకాంత్‌, గన్నవరపు శ్రీనివాసరావులతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు, నాయకులు పాల్గొని నిరసన తెలిపి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం బొంతువారిపేట నుంచి ఈదరపల్లి వంతెన వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ కరవైందని మండిపడ్డారు. సాల్మన్‌ హత్య అత్యంత దారుణమని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా చంద్రబాబూ?అని ప్రశ్నించారు. బాధితుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎమ్మెల్యే యరపతినేని రక్తదాహానికి

సాల్మన్‌ బలి : జగ్గిరెడ్డి

పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల ఇష్టారాజ్యంతో వందలాది కుటుంబాలు గ్రామం వదిలి వెళ్లిపోయాయన్నారు. భార్య అనారోగ్యం కారణంగా సొంతూరికి చూడటానికి వచ్చిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త సాల్మన్‌ను కిరాతకంగా టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి అతనిపై కేసులు పెట్టారన్నారు. పల్నాడులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ గూండాల రక్తదాహానికి సాల్మన్‌ బలైపోయాడని అరోపించారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్నిబిహార్‌లా మార్చేసి వేడుక చూస్తున్నావా చంద్రబాబు అని ప్రశ్నించారు. పీఏసీ సభ్యుడు విశ్వరూప్‌ మాట్లాడుతూ దళితులపై దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. లోకేష్‌ రెడ్‌ బుక్‌ను ఇప్పటికై నా పక్కన పెట్టాలి అని అన్నారు. చంద్రబాబు 18 నెలల పాలనలో 180 మంది దళితులపై హత్యలు, ఆత్యాచారాలు దాడులు జరిగాయని అన్నారు.

పోలీసులు విఫలం : ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ సాల్మన్‌ హత్య జరగకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారన్నారు. సాల్మన్‌ హత్య తర్వాత దహన సంస్కారాలు కూడా చేయకుండా బంధువులను, నాయకులను అడ్డుకోవడం దారుణమని అన్నారు. సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ ఈ హత్య చంద్రబాబు ప్రభుత్వ అరాచకమని అన్నారు. చంద్రబాబు 18నెలల పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రలో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో దళితులకు రక్షణ లేకుండా పొయిందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. దళితులపై దాడులు చేయడానికేనా మీకు అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, ఎస్‌ఈసీ కుడుపూడి బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్యకుమార్‌, కర్రి నాగిరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, ఎంపీపీ యిళ్ల శేషరావు, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరిరామ్‌ గోపాల్‌, గౌనుకు గౌతమ్‌, మున్సిపల్‌ చైర్మన్‌, రెడ్డి నాగేంద్రమణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు, వైస్‌ ఎంపీపీ పొలమూరి బాలకృష్ణ, అమలాపురం పట్టణ, రూరల్‌ మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవరావు, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు, తిక్కా ప్రసాద్‌, సరెళ్ల రామకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, తోరం గౌతమ్‌ రాజా, జాన గణేష్‌, సూదా గణపతి, విత్తనాల మూర్తి, చింతా రామకృష్ణ, వాసంశెట్టి సత్యనారాయణ, తిరుకొటి సతీష్‌కుమార్‌, ఉండ్రు చేట్ల రామారావు ,దూడల ఫణి, అడపా బాబులు, ఊటాల ఉదయకుమార్‌, ఎంపీటీసీ సభ్యులు వాసంశెట్టి శ్రీను, చొల్లంగి సుబ్బిరామ్‌, రేవు శ్రీనివాసరావు గుత్తుల సత్తిబాబు , కడిమి ప్రవేణ్‌, ఈతకోట శ్రావణ్‌ పాల్గొన్నారు.

– సాల్మన్‌ పాశవిక హత్యకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement