● ఎటూ చూసినా..
పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేట సాగిస్తున్న మత్స్యకారులకు పంట పండింది. కనుమ రోజు శుక్రవారం సాయంత్రం సముద్రంపై లోతు జలాల్లోకి ఒక సోనా బోటుపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు సుమారు 20 టన్నుల టూనా రకం చేపలు చిక్కాయి. వీటిని శనివారం ఉదయం బోటులో హార్బర్‌కు తీసుకు వచ్చారు. వీటి విలువ మార్కెట్‌లో సుమారు రూ.40 లక్షలు వరకూ పలికిందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.
–సఖినేటిపల్లి
● మంచు కురిసే వేళలో..
మంచు కురిసే వేళలో ప్రకృతి అందాలు వర్ణనాతీతం. అంబాజీపేటలో హిమసోయగం కనువిందు చేసింది. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుంది. సూరీడు కూడా మంచు పొరలు చీల్చుకుని వెలుగులు ప్రసరింపజేయడానికి అష్టకష్టాలు పడ్డాడు. పచ్చని పంట పొలాలు, రహదారిపై మంచు పరదా కప్పేసింది. శనివారం ఉదయం 10 గంటలు దాటినా పొగ మంచు తొలగకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని పయనించారు. –అంబాజీపేట
● చేయి కలిపి.. ప్రాణం నిలిపి
విధి నిర్వహణలోనే కాదు.. అవసరమైతే ప్రాణాలు కాపాడతామని ఆ అధికారులు నిరూపించి అందరి మన్ననలు పొందారు. మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో శుక్రవారం జరిగిన ప్రభల తీర్థానికి భారీగా జనం వచ్చారు.
అక్కడ రాజమహేంద్రవరానికి చెందిన గొంతి గుణ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతనికి పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, అంబాజీపేట డిప్యూటీ ఎంపీడీఓ కె.శ్రీనివాస్‌లు ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అప్పటికీ ఊపిరి అందకపోవడంతో అర కిలోమీటరు దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లి అమలాపురం ఆసుపత్రికి తరలించారు.
–అంబాజీపేట
పల్లిపాలెం మార్కెట్‌లో ఐస్ బాక్సుల్లో భద్రపరుస్తున్న టూనా చేపలు
● ఎటూ చూసినా..
● ఎటూ చూసినా..


