శనైశ్చరునికి ప్రత్యేక తైలాభిషేకాలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ప్రాతఃకాల సమయంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,53,290, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.99,200, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.37,684 వచ్చిందని ఈఓ సురేష్‌బాబు వివరించారు.


