అప్పులతో పాలన సాగిస్తున్న చంద్రబాబు
● 18 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పు
● మెడికల్ కళాశాలలకు
రూ.5,200 కోట్లు ఖర్చు చేయలేరా!
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వరూప్
● భోగిమంటలో పీపీపీ
జీవో ప్రతుల దహనం
అమలాపురం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పులతో రాష్ట్రాన్ని అతి కష్టంగా నడిపిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్టినేటర్ పినిపే విశ్వరూప్ అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు అమలాపురం మండలం భట్నవిల్లిలోని ఆయన నివాస ప్రాంగణంలో బుధవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను భోగి మంటలో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడేందుకు వాటిలో కేవలం రూ.5 వేల కోట్లు కూడా కేటాయించలేదని తెలిపారు. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేసి కోటి సంతకాలు సేకరించి, గవర్నర్‌కు అందించినా చంద్రబాబు ప్రభుత్వ మెండిగా వ్యవహరిస్తోందన్నారు. ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన మనుషులకు పీపీపీ విధానంలో ఇచ్చేస్తున్నారని విమర్శించారు.
రద్దు చేసేవరకూ పోరాటం
ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రూ.1700 కోట్లు ఖర్చుచేయనున్న చంద్రబాబు ప్రభుత్వానికి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు డబ్బు లేకపోవడం హాస్యాస్పదమన్నారు. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ వందేళ్లలో రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి వెంకటేశ్వరబాబు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్న నాయుడు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, చేనేత సెల్ అధ్యక్షుడు జాన గణేష్, ఎంపీపీ ఇళ్ల శేషారావు, జెడ్పీటీసీ సభ్యడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సంసాని చంద్రశేఖర్, గుత్తుల చిరంజీవి, కొనుకు బాపూజీ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సరేళ్ల రామకృష్ణ, ఎంపీటీసీలు చొల్లంగి సుబ్బిరామ్, వాసంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రతినిధులు బొడ్డు బుజ్జి, ఇళ్ల గోపాలకృష్ణ, తిక్కా వెంకట ప్రసాద్, దూడల ఫణికుమార్, ఈతకోట శ్రావణ్, తిరుకోటి సతీష్, గుద్దటి నాగరాజు, ఊటల ఉదయ్, సంతోష్ పాల్గొన్నారు.


