ఇది జగన్ సాధించిన నైతిక విజయం
అల్లవరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు విడుదల చేసిన జీవోపై మూడు నెలల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన నైతిక విజయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. సామాన్యులకు ఉచిత విద్య, వైద్యాన్ని దూరం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓ కాపీలను ఆమె భోగిమంటలో వేసి దహనం చేశారు. అల్లవరం మండలం మొగళ్లమూరులో బుధవారం ఆమె నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.


