సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి
అమలాపురం రూరల్: సంక్రాంతి సంబరాలు కోనసీమ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సిబ్బందికి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఉద్యోగులతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంక్రాంతి పండగ ప్రాధాన్యతను తెలియ జేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఎకో ఫ్రెండ్లీ విధానానికి నాంది పలుకుతూ తొలి దశలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వాటర్ బాటిల్స్ ఉచితంగా అందించామని, రెండో దశలో సంక్రాంతి సందర్భంగా మట్టి పాత్రలు పంపిణీ చేశామన్నారు. డీఆర్‌ఓ మాధవి మాట్లాడుతూ కోడి పందేలు, జంతు హింస సంబంధిత కార్యక్రమాలు నిషేధించామన్నారు. ఎడ్ల బండిపై జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓలు కలెక్టరేట్ ప్రాంగణంలో విహరించి సందడి చేశారు. డీఎస్‌ఓ అడపా ఉదయభాస్కర్, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ ,కలెక్టరేట్ ఉద్యోగి భరత్ పాల్గొన్నారు.
సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి


