పోలీసుల రాకతో పందెం రాయుళ్ల పరారీ
కామనగరువులో సాగిన కోడి పందేలు, పోలీసుల రాకతో పందెం రాయుళ్లు వదిలేసిన కోడిపుంజులు
సాక్షి, అమలాపురం: రాజకీయ అండదండలను చూసుకుని పందెం రాయుళ్లు బరితెగించారు. సంక్రాంతి పండగకు ముందే కోడిపందేలు నిర్వహించి పోలీసులకు సవాల్ విసిరారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కోడి పుంజులు వదిలి పరారయ్యారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాలవారిపాలెంలో ఒక మంత్రి కొబ్బరి తోటలో పండగకు ముందు రోజు మంగళవారం సాయత్రం కోడిపందేలు జోరుగా సాగాయి. ఈ పందేలను వీక్షించేందుకు వాహనాల్లో వందలాది మంది జనం గుమిగూడారు. రాజకీయ నాయకుల ప్రోద్బలాన్ని చూసుకుని పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. రూ.లక్షల్లో బెట్టింగులు వేస్తూ పందేలు సాగించారు. ఈ పందేల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అమలాపురం తాలూకా ఎస్సై శేఖర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోడిపుంజులు వదిలి పందెం రాయుళ్లు పరారయ్యారు. చివరికి బరిలో కోడిపుంజులు మిగిలాయి!
పోలీసుల రాకతో పందెం రాయుళ్ల పరారీ


