● గంగిరెద్దుల ఆట.. హరిదాసుల పాట
మామిడికుదురు మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంచి భోగి దండలు
సంక్రాంతి పండగకు ముందు వచ్చే భోగి రోజున అందరూ మంట వద్దకు వెళ్లి ఆవు పిడకల దండలు వేస్తుంటారు. గతంలో ముందుగానే పల్లెల్లో ఆవుపేడతో భోగి పిడకలను తయారు చేసుకుని దండలు కట్టి మంటల్లో వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో భోగి పిడకలు మార్కెట్‌లో విక్రయిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసి మంటల్లో వేస్తున్నారు. దండ సైజును బట్టి రూ.30 నుంచి రూ.40, రూ.50. రూ.100, రూ.150 ఇలా పలు రకాల రేట్లకు విక్రయిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రులు తీసుకొచ్చి పిడకల దండలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
పి.గన్నవరం మండలం నాగుల్లంకలో డూడూ బసవన్నలు
పెదపట్నంలంకలో మోటారు సైకిల్‌పై హరిదాసు
సంక్రాంతి పండగ రానే వస్తోంది.. పల్లెలకు డూడూ బసవన్నలు, హరిదాసులతో సందడి నెలకొంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.. సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలే కాదు.. మన జానపద కళల సజీవ రూపం. హరిలో రంగ హరి అంటూ దీవించే హరిదాసులు, సన్నాయి డోలు వాయిద్యాలకు అనుగుణంగా ఆడే గంగిరెద్దులు, రకరకాల రూపాలతో అలరించే పగటి వేషగాళ్లు.. వీరంతా మన సంస్కృతికి వెన్నెముక. పండగ వేళ ఇళ్ల ముంగిటకు వస్తున్న చేతివృత్తుల వారిని, జానపద కళాకారులను ఆదరిస్తూ.. మన మూలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మామిడికుదురు
● గంగిరెద్దుల ఆట.. హరిదాసుల పాట
● గంగిరెద్దుల ఆట.. హరిదాసుల పాట


