వివేకానందుని ఆదర్శాలు శాశ్వత ప్రేరణ | - | Sakshi
Sakshi News home page

వివేకానందుని ఆదర్శాలు శాశ్వత ప్రేరణ

Jan 13 2026 5:47 AM | Updated on Jan 13 2026 5:47 AM

వివేక

వివేకానందుని ఆదర్శాలు శాశ్వత ప్రేరణ

గీత దాటితే కేసులు

అమలాపురం రూరల్‌: స్వామి వివేకానంద మహోపదేశం యువతను ధైర్యం, ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిపిస్తుందని కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌, ఎస్పీ రాహుల్‌ మీనా, కలెక్టరేట్‌ ఏవో విశ్వే శ్వరరావులు స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే ఈ పవిత్ర దినంలో యువతకు ఆయన ఆదర్శాలు శాశ్వత ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఎస్పీ రాహుల్‌ మీనా మాట్లాడుతూ యువతకు మార్గ దర్శకుడిగా నిలిచిన స్వామి వివేకానంద తన ఆలోచనలు, ఉపదేశాల ద్వారా దేశానికి గర్వకారణం అయ్యారన్నారు.

పండగ ముసుగులో

ఎస్పీ రాహుల్‌ మీనా హెచ్చరిక

అమలాపురం టౌన్‌: సంక్రాంతి పండగ వేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్‌మీనా స్పష్టం చేశారు. పండగల ముసుగులో ఎవరైనా గీత దాటితే వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ మేరకు ఎస్పీ మీనా సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కోడి పందేలు, జూదాలు ఆడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బరులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. జూదాలకు దూరంగా ఉండాలని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆటోల ద్వారా మైక్‌ అనౌన్స్‌మెంట్లు ఇస్తూ, కర పత్రాలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర సాయం కోసం డయల్‌ 112కి గాని దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

అంతర్వేది ఉత్సవాల

వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

సఖినేటిపల్లి: అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న లక్ష్మీనరసింహాస్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల వాల్‌ పోస్టర్‌ను సోమవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ ఆవిష్కరించారు. అంతకు మందు ఆలయంలో అర్చకులు స్వామి సన్నిధిలో వీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టూరిజం గెస్ట్‌హౌస్‌లో ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ అధ్యక్షతన డిపార్ట్‌మెంట్‌ల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, గోదావరి సెంట్రల్‌ డెల్టా ప్రాజెక్ట్‌ చైర్మన్‌ గుబ్బల శ్రీనివాస్‌, సర్పంచ్‌ కొండా జాన్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు పాల్గొన్నారు.

వివేకానందుని ఆదర్శాలు శాశ్వత ప్రేరణ 1
1/1

వివేకానందుని ఆదర్శాలు శాశ్వత ప్రేరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement