మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
● హుర్రె.. ఔరా గొర్రె
పొట్టిగా ఉండే పుంగనూరు ఆవులు.. చిన్నగా ఉన్న కుక్కలను చూస్తుంటాం.. కానీ పొట్టి రకం గొర్రెలు ఉంటే ఆశ్చర్యమే కదా.. అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన అడబాల ప్రేమ్‌కుమార్ కర్ణాటకలో ‘బన్నూరు’ రకం పొట్టి గొర్రెలు నాలుగింటిని రూ.లక్షకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. సాధారణంగా ఈ రకం గొర్రెలు 8 నుంచి 10 ఏళ్ల వరకు జీవిస్తాయన్నారు. చూడటానికి బుట్ట బొమ్మల మాదిరిగా ఉంటాయని, ఇళ్లల్లో షోగా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయని ప్రేమ్‌కుమార్ వివరించారు. వీటి నిర్వహణ ప్రత్యేకంగా ఏమీ ఉండదని, పచ్చి, ఎండు గడ్డి తింటాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఈ రకం గొర్రెలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు.
అంబాజీపేట
మాచవరంలో అబ్బురపరుస్తున్న పొట్టి గొర్రెలు


