పోలీస్‌ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు

Jan 13 2026 5:47 AM | Updated on Jan 13 2026 5:47 AM

పోలీస

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు

అమలాపురం టౌన్‌: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 23 అర్జీలు వచ్చాయి. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌ నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు.

సర్పంచ్‌పై దాడి చేసిన వారిని

కఠినంగా శిక్షించాలి

పోలీస్‌ గ్రీవెన్స్‌కు జిల్లా దళిత ఐక్య వేదిక ప్రతినిధులు హాజరై కామనగరువు సర్పంచ్‌, ఆమె భర్తపై అమానుషంగా దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఏఎస్పీ ప్రసాద్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. దళిత ఐక్య వేదిక జిల్లా చైర్మన్‌ డీబీ లోక్‌, కన్వీనర్‌ జంగా బాబూరావు, ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు తదితరులు ఏఎస్పీని కలిసి సర్పంచ్‌ దంపతులపై జరిగిన దాడిని వివరించారు.

అర్జీలకు పరిష్కార మార్గాలు చూపాలి

అమలాపురం రూరల్‌: అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నూరు శాతం పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు డీఆర్‌ఓ కే. మాధవి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఆమె నిర్వహించారు. సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ జి.మమ్మీ, డీఎల్‌డీవోలు రాజేశ్వరరావు, వేణుగోపాల్‌ 150 అర్జీలను స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో విచారించి సంతృప్తి కర స్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు1
1/1

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement