శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
బ్రాయిలర్..
లేయర్‌దీ
అదే దారి..
దేశవాళీ పందెం కోళ్లు, నాటు కోళ్లతో పాటు బ్రాయిలర్, లేయర్ కోళ్ల ధరలు సైతం భారీగా పెరిగియి. బ్రాయిలర్ లైవ్ ధర రూ.190 వరకు ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.120 పలుకుతోంది. బ్రాయిలర్ మాంసం కేజీ రూ.300 వరకు ఉండగా, లేయర్ కేజీ రూ.240 వరకు చేరింది. పండగతో పాటు కోళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వల్ల వీటి ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
పందెం పెరిగే కొద్దీ..
గోదావరి జిల్లాలంటేనే కోడి పందేలకు పెట్టింది పేరు. పెద్ద పండగకు ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో వందలాది బరులలో పందేలు సహజం. ఈ నేపథ్యంలో పందెం కోళ్లకు రకాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. బరిలో పందెం పెరిగే కొద్దీ వీటి ధరా అదే స్థాయిలో పెరుగుతుంది. జిల్లాలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, అల్లవరం, మలికిపురం మండలాల్లో వీటిని పెద్ద ఎత్తున పెంచుతున్నారు.
నానాటుకీ గిరాకీ
పందెం కోడి స్థాయి కాకున్నా నాటు కోళ్లకు సైతం డిమాండ్ ఎక్కువే. రెండు కేజీల నాటు కోడి పెట్ట రకాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. గత నెలలో వీటి ధర రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఉండగా, పండగ పేరు చెప్పి ధరలు పెంచేశారు.
కొక్కొరుకో జరా..!
పెద్ద పండగ ప్రభావం కోళ్లపై పెద్దగానే పడింది. వాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మూడు రోజుల పెద్దపండగ సందర్భంగా పందేలకు, మాంసాహార విందులకు వీటిని ఎక్కువగా వినియోగించే అవకాశముండడంతో ధరలు గణనీయంగా పెరిగాయి. ఆగవమ్మా.. కొండ దిగిరావమ్మా అని ప్రజలు బతిమలాడుతున్నారు. సాక్షి, అమలాపురం
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026


