వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడ
అల్లవరం: అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ ఆ పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అనురాధ ఉమ్మడి తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని మహిళా విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారమే లక్ష్యంగా మహిళా శక్తిని సమీకరించి, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ఈ నియామకం తన బాధ్యతలను మరింత పెంచిందని, పార్టీ బలోపేతానికి అహర్నిశలూ కృషి చేస్తానని అనురాధ తెలిపారు. తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తున్న పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనురాధకు పలువురు పార్టీ నాయకు లు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
బ్లో అవుట్ బాధితులకు
5 లక్షల పరిహారం ఇవ్వాలి
మలికిపురం: ఇటీవల ఇరుసుమండలో జరిగిన గ్యాస్ విస్పోటం వల్ల ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని, ఇళ్లు వదలి పారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ ీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో గ్రామంలో ధర్నా జరిగింది. ఆయన మాట్లాడు తూ ముసలివారు, పిల్లలు, మహిళలు తలో ది క్కుకు వెళ్లిపోవడంతో ఇళ్లలో దొంగలు పడి దొరి కింది దొరికినట్టు దోచుకుపోయారని, ఈ గ్యాస్ బావులు ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టడంతో భద్రతా చర్యలు లోపించాయని, పర్యవేక్షణ కూ డా లేదని, అపారమైన చమురు, గ్యాస్‌ను గుజరా త్ కంపెనీలు తరలించుకుపోయి, రూ.కోట్లు కొల్ల గొట్టి ఇక్కడ కనీసం సామాజిక బాధ్యత కింద గ్రా మాలను అభివృద్ధి చేయలేదని ఆగ్రహించారు. తక్షణమే నిపుణులతో విచారణ జరిపి గ్యాస్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
14న గోదా కల్యాణం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో గోదా రంగనాథుల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. భోగి పండగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఈ కల్యాణాన్ని నిర్వహించనున్నట్టు ఈఓ తెలిపారు. కారణాంతరాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్న యువతీ యువకులు ఈ కల్యాణంలో పాల్గొనడం వల్ల శీఘ్రంగా ఓ ఇంటివారవుతారని భక్తుల నమ్మకం. ఈ మేరకు వాడపల్లి క్షేత్రంలో నిర్వహించే కల్యాణానికి అవివాహితులైన భక్తులు విశేషంగా హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. భక్తులంతా సంతృప్తి చెందేలా చూడాల్సిన బాధ్యత ఆలయ వర్గాలపై ఉన్నదని ఈఓ సూచించారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడ
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడ


