లాభసాటి దిగుబడి
నేను 18 ఎకరాలలో కౌలుకు వ్యవసాయం చేస్తున్నాను. దాదాపు పదేళ్ల నుంచి బెంగాలీ కూలీలను వాడుతున్నాను. నాట్ల సమయంలో స్థానిక కూలీలు సర్దుబాటు కావడం లేదు. అందుకే ఏటా నాట్ల సమయానికి ఏజెంట్ల ద్వారా వారిని రప్పిస్తాను. వీరు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాన్ని నాటుతారు. పైగా వీరికయ్యే ఖర్చు స్థానిక కూలీలతో పోల్చుకుంటే తక్కువే. – నిమ్మకాయల నాగేశ్వరరావు,
రైతు, మునిపల్లి ఉప్పలగుప్తం మండలం
ఏటా వస్తుంటాం
ఖరీఫ్, రబీ సమయాల్లో జరిగే నాట్లకు ఏటా వచ్చి పని చేసుకుపోతాం. నవంబర్‌లో ఇక్కడకు వచ్చాం. నెల్లూరులో నెల పాటు నాట్లు వేసి తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దాదాపు 20 రోజులు పని చేస్తాము. తర్వాత సొంతూళ్లకు వెళ్లి పనులు చేసుకుంటాం. మాకు మేస్త్రి ఉంటాడు. అన్ని ఖర్చులు మేస్త్రి పెట్టుకుని ఎకరానికి రూ.3,500 వరకు మాకు ఇస్తాడు.
– నరేష్ చంద్ర గైన్, వలస కూలి, నార్త్ 24 పొంగనాడ్ జిల్లా, పశ్చిమబెంగాల్


