ఫుల్‌ హుషార్‌ | - | Sakshi
Sakshi News home page

ఫుల్‌ హుషార్‌

Jan 9 2026 7:19 AM | Updated on Jan 9 2026 7:19 AM

ఫుల్‌ హుషార్‌

ఫుల్‌ హుషార్‌

సాక్షి, అమలాపురం: సంక్రాంతి పండగ త్వరలో రాబోతోంది. ప్రతిసారీ ఈపాటికే ఎక్కడ చూసినా పండగ సందడి కనిపించేది. కానీ ఈసారి ఆ జోష్‌ లేదు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పిండి వంటలు చేసుకోవడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొండెక్కిన బస్సు టిక్కెట్‌ ధరలతో సొంతూరుకు రావడానికి దూర ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వ్యాపారాలు కూడా అనుకున్న స్థాయిలో లేవని వస్త్ర, బంగారు ఆభరణాలు, ఆటోమొబైల్‌ వ్యాపారులు నీరుగారి పోతున్నారు. కానీ ఒక్క మద్యం వ్యాపారులు మాత్రం పండగ కోసం ‘ఫుల్‌’ హుషారుగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగినట్టుగా మద్యాన్ని భారీగా నిల్వ చేసుకుంటున్నారు. పనిలో పనిగా ధరలు పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు.

మద్యం విక్రయాలపై ఆశలు

సంక్రాంతి పండగ అమ్మకాలపై మద్యం వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్టుగా వైన్‌ షాపు ల వద్ద భారీగా నిల్వలు ఉంచారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు అంచనాలకు మించి అమ్మకాలు జరిగాయి. దీంతో సంక్రాంతి పండగ సీజన్‌లో మరింత అధికంగా జరుగుతాయి వ్యాపారులు లెక్కలు వేసుకుంటున్నారు.

రూ.15.29 కోట్ల విక్రయాలు

నూతన సంవత్సర వేడుకలకు జిల్లాలో అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగాయి. డిసెంబరు 30వ తేదీన జిల్లాలో 11,045 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 4,346 బీర్ల కేసులు విక్రయించారు. వాటి విలువ దాదాపు రూ.8.85 కోట్లు. ఇక 31న 8,107 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 3,388 బీర్ల కేసుల అమ్మకాలతో రూ.6.44 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఈ రెండు రోజులు కలిపి 19,152 ఐఎంఎల్‌ కేసులు, 7,734 బీర్ల కేసులు అమ్ముడుపోగా రూ.15.29 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన రూ.4.37 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, ఈ ఏడాది 31వ తేదీన రూ.6.44 కోట్లు జరగడం గమనార్హం. గత ఏడాది కన్నా 67 శాతం మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి. ఈ ఏడాది డిసెంబరు 31 కన్నా ముందు రోజు 30న భారీగా అమ్మకాలు జరిగాయి.

పండగకే ఎక్కువ వినియోగం

నూతన సంవత్సర వేడుకల కన్నా పండగకే మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ ఏడాది సంక్రాంతి పండగ జనవరి 14 బుధవారం భోగితో మొదలవుతోంది. తొమ్మిదో తేదీ రెండో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో చాలా మంది 8వ తేదీన బయ లుదేరి వస్తున్నారు. 18వ తేదీ ఆదివారం తిరిగి వెళ్లనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు జిల్లాలోని తమ కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో ఏకంగా పది రోజుల పాటు గడపనున్నారు. ఈ కారణంగా పండగ సీజన్‌లో కనీసం మూడు రెట్లు అమ్మకాలు జరిగే అవకాశముంది. దీనికి తగినట్టుగానే మద్యం షాపుల యజమానులు మద్యం ఐఎంఎల్‌ కేసులు, బీర్లు కేసులను నిల్వ చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన అమలాపురం ఐఎంఎల్‌ డిపోల వద్ద మ ద్యం లోడు లారీలు, వ్యాన్లు బారులు తీరుతున్నాయి.

సిండికేట్లు

జిల్లాలోని మద్యం షాపులలో 80 శాతం సిండికేట్లుగా మారి అమ్మకాలు చేస్తున్నారు. వీటిలో అధికార టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల అనుచరులు, కొన్ని చో ట్ల నేరుగా కీలక ప్రజాప్రతినిధులు బినామీలను పెట్టి మద్యం వ్యాపారం చేస్తుండడంతో ధరలను అడ్డుకోవ డం ఎకై ్సజ్‌ అధికారులకు సాధ్యం కావడం లేదు. అమలాపురం మున్సిపాలిటీ, అంబాజీపేట మండలాలు వంటి రెండు, మూడు చోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో మద్యం అదనపు ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ధరలు పెంచి అమ్మకాలు చేయడం, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎకై ్సజ్‌ అధికారులు మద్యం దుకాణాలను తనిఖీ పేరుతో ఒకటి, రెండు రోజులు హడావుడి చేశారు. ఉన్నత వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో ఆ తర్వాత చేతులు ఎత్తేశారు.

పండగలో మద్యం అమ్మకాలపై

వ్యాపారుల ఆశలు

ఇప్పటికే దుకాణాల్లో భారీగా నిల్వలు

న్యూఇయర్‌కు ముందే పెంచేసిన ధరలు

మందుబాబుల జేబులకు చిల్లు

పట్టించుకోని అధికార యంత్రాంగం

ధరల దందా

పండగలో భారీ అమ్మకాల మీదనే కాదు, ధరలు పెంచి లాభాలు కొల్లగొట్టేందుకు సైతం మద్యం వ్యాపారులు సిద్ధమయ్యారు. ప్రతి క్వార్టర్‌ బాటిల్‌పై రూ.పది చొప్పున పెంచేశారు. తద్వారా జిల్లాలో మద్యం అమ్మకాల మీద ఈ పండగ సీజన్‌లోనే రూ.లక్షలు కొల్లగొట్టనున్నారు. మొదట ట్రైలర్‌గా నూతన సంవత్సర అమ్మకాల కన్నా వారం రోజుల ముందు ముమ్మిడివరం నియోజకవర్గంలో మద్యం రేట్లు పెంచి అమ్మకాలు చేశారు. ఇక్కడ మద్యం ప్రియుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో మిగిలిన నియోజకవర్గంలో సైతం రేట్లు పెంచడం మొదలు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement