● మర్యాద పూర్వకంగా..
రావులపాలెం/అల్లవరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కలిశారు. అలాగే ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కూడా జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీగా శ్రీనివాసరావు
ముమ్మిడివరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరానికి చెందిన ప్రముఖ న్యాయవాది కోన వెంకట శ్రీనివాసరావును ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా నియమించారు. ఆయన గతంలో ముమ్మిడివరం నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధిగా పలు పదవులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ పదవి రావడానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కో ఆర్డినేటర్ వెంకట సతీష్ కుమార్, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీను, పెనుమత్స చిట్టిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
కొబ్బరి రైతులకు ఊరట
అంబాజీపేట: నీటి కొబ్బరికాయ ధర పెరగడంతో రైతులకు ఊరట లభించింది. వారం రోజుల నుంచి కొబ్బరికాయల ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. కొబ్బరి దిగుబడులు తగ్గుముఖం పట్టడంతో నీటి కాయల ధర పెరిగిందని భావిస్తున్నారు. ప్రస్తుతం నీటి కొబ్బరికాయ (పచ్చి) రూ.15 వేల నుంచి రూ.16 వేలకు, ముక్కుడు కాయలు రూ.16 వేల నుంచి రూ.18 వేలకు పెరిగాయి. రానున్న సంక్రాంతి, శివరాత్రికి మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
● మర్యాద పూర్వకంగా..
● మర్యాద పూర్వకంగా..


