నేడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష
అమలాపురం రూరల్: అమలాపురం భట్లపాలెం ఇంజనీరింగ్ కాలేజీ, కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్ బేస్డ్ డిపార్టమెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఆమె బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
ఫ ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జేసీ నిషాంతి అన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో కమిటీ సభ్యులతో సమీక్షించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. మాల్ ప్రాక్టీస్ నివారణకు జిల్లాస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, కంట్రోల్ రూమ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 25,907 మంది మొదటి, రెండో సంవత్సర విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.


