
సమాజ సేవకు అరుదైన గౌరవం
రావులపాలెం: సమాజ సేవలో తరిస్తున్న శ్రీకాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థకు రాజ్‌భవన్ గుర్తింపుతో అరుదైన గౌరవం లభించింది. ఆ సంస్థ ప్రెసిడెంట్ గొలుగూరి సతీష్‌రెడ్డి, సభ్యుడు సోమిరెడ్డిలు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నుంచి అభినందనలు అందుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. రావులపాలేనికి చెందిన గొలుగూరి సతీష్‌రెడ్డి, పడాల సోమిరెడ్డి తదితరులు సమాజ సేవే లక్ష్యంగా మూడేళ్ల కిందట శ్రీకాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థను స్థాపించారు. వాట్సాప్ గ్రూపు ద్వారా ఫ్రెండ్స్ సర్కిల్ పెంచుకుని వారందరి సహాయంతో ఆపదలో ఉన్న పేదలకు సేవలందిస్తున్నారు. ఈ సంస్థ సేవలను ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి జిల్లా నుంచి శ్రీకాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థను ఎంపిక చేసి ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఆ మేరకు ప్రెసిడెంట్ సతీష్‌రెడ్డితో సంస్థ సభ్యుడు పడాల సోమిరెడ్డి హాజరయ్యారు. ఆ రోజు సాయంత్రం ఇచ్చిన తేనీటి విందులో పైఇద్దరూ పాల్గొనగా గవర్నర్ నజీర్ అభినందించారు. ఆదివారం విలేకరులతో సతీష్‌రెడ్డి, సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లా నుంచి తమ సేవా సంస్థ ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.
నేడు యథావిధిగా ప్రజా
సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్‌లో నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితోపాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. డివిజన్ స్థాయిలో జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల్లో, మండల స్థాయిలో సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో, అలాగే మున్సిపల్ స్థాయిలో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
తులాభారానికి త్రాసు సమర్పణ
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయానికి తోటపేటకు సత్తి సుబ్బారెడ్డి, సీతారత్నం దంపతులు ఆదివారం తులాభారం నిమిత్తం ఇత్తడి త్రాసును సమర్పించారు. ఈ తక్కెడను ఆలయ అర్చకుడు సత్తిబాబుకు అందజేశారు. దీని విలువ రూ.1.50 లక్షలు కాగా, దాతను అర్చకులు సత్కరించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
పంచారామ క్షేత్రంలో
రేపు వేద పరిషత్
సామర్లకోట: ఏటా నిర్వహిస్తున్న వేద పరిషత్‌ను మంగళవారం పంచారామ క్షేత్రం శ్రీబాలా త్రిపుర సుందరి సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ కన్వీనర్ గ్రంధి సత్యరామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని వేదపండితులచే 27వ వేద సభ నిర్వహించి వేదపండితులను సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా లోక కల్యాణార్థం హిందూ సంస్కృతి, సంప్రదాయానుసారంగా చతుర్వేద పారాయణ, వేద స్వస్తి జరుగుతుందని చెప్పారు.

సమాజ సేవకు అరుదైన గౌరవం

సమాజ సేవకు అరుదైన గౌరవం