
లోవకు భక్తుల తాకిడి
తుని రూరల్: జోరువానలోను తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 13 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో వంటలు, భోజనాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. టార్పాలిన్‌ను కట్టుకుని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,43,280, పూజా టికెట్లకు రూ.1,27,400, కేశఖండనశాలకు రూ.12,800, వాహన పూజలకు రూ.4350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.96,216, విరాళాలు రూ.49,117 వెరసి మొత్తం రూ.4,33,163 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు.