కారు కొనివ్వలేదని యాసిడ్‌ తాగాడు..  | Young Man Committed Ends Life By Drinking Acid In Jagtial District | Sakshi
Sakshi News home page

కారు కొనివ్వలేదని యాసిడ్‌ తాగాడు.. 

Mar 28 2022 3:23 AM | Updated on Mar 28 2022 12:33 PM

Young Man Committed Ends Life By Drinking Acid In Jagtial District - Sakshi

భానుప్రకాశ్‌ 

కోరుట్ల: తనకు కారు కొనివ్వడం లేదని సీపెల్లి భానుప్రకాశ్‌గౌడ్‌ (22) అనే యువకుడు యాసిడ్‌ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మం డలం కల్లూర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. కల్లూ ర్‌ గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు భానుప్రకాశ్‌గౌడ్‌ కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబసభ్యులను కోరుతూ వస్తున్నాడు.

15 రోజులుగా మరింత పట్టుబట్టి ఇంట్లో వారిని అడిగితే, ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామశివారులో యాసిడ్‌ తాగాడు. ఆ తర్వాత మంటకు తాళలేక అరుస్తూ రోడ్డుపైకి వచ్చాడు. ఇది గమనించిన స్థానికులు భానుప్రకాశ్‌ను ఇంటికి తీసుకెళ్లారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ఇదివరకు కూడా సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని భానుప్రకాశ్‌ చేయి కోసుకున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement