బట్టలు కొనలేదని బలవన్మరణం 

Women Suicide In Mancherial District For New Clothes - Sakshi

భీమారం(చెన్నూర్‌): సద్దుల బతుకమ్మ పండుగకు తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ గట్ల సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి శంకరయ్య, శంకరమ్మ దంపతులు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

వీరి కూతురు వనిత (20) ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ కోసం కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడింది. మంగళవారం ఉదయం మళ్లీ తల్లితో గొడవ పడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో చికిత్స నిమి త్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోని భీమారం వద్ద చనిపోయింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top